ASR: జీకేవీధి మండలం ఏబులం గ్రామంలో కుసుమ పంట సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 25 ఎకరాల్లో సాగు కోసం ఉచితంగా విత్తనాలు అందించనున్నట్లు మండల వ్యవసాయ అధికారి సురేష్ తెలిపారు. నేలలు, కలుపు నివారణ, ఎరువుల వినియోగం, నీటి తడులపై చింతపల్లి RARS శాస్త్రవేత్త డా.బయ్యపురెడ్డి సూచనలు చేశారు. కుసుమ నూనె గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
కుసుమ సాగుపై రైతులకు అవగాహన


