ASR: అరకు మండలం బంగ్లావలసలో భూ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. మంగళవారం నిర్వహించిన రీ సర్వే గ్రామసభలో తహసీల్దార్ హామీతో సర్వేకు సహకరించినట్లు తెలిపారు. కోర్టు వివాదంలో ఉన్న భూముల సర్వేతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తమ వారసత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భూ సమస్య పరిష్కరించాలి'


