హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియామకాల్లో పారదర్శకత పాటించాలి: కలెక్టర్

HNK: జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ల నియామక ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో కొనసాగుతున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను జిల్లా సంక్షేమ అధికారి ఎం.విశ్వజతో కలిసి ఆమె తనిఖీ చేశారు. అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.