హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించరాదు'

ప్రకాశం: దసరా సెలవుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని జిల్లా విద్యాశాఖాధికారి సామా సుబ్బారావు తెలిపారు. ఈ నిబంధనల అమలుపై ఎంఈవోలు, ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సెలవుల సమయంలో పాఠశాలలు నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యాజమాన్యాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.