హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేవెళ్ల డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి

NRPT: గిరిజనులకు కాంగ్రెస్‌ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. అశోక్‌ డిమాండ్‌ చేశారు. అచ్చంపేటలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాలని, తండాలకు రెవెన్యూ హోదా కల్పించడంతో పాటు అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని కోరారు.