హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రైవేట్ టీచర్‌కు 30 రోజుల జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరు (మం) కే.ఎస్.పల్లికి చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు అమీర్ బాషాకు న్యాయస్థానం 30 రోజుల జైలు శిక్ష విధించింది. ఎనిమిదేళ్లుగా భార్య, కుమారుడిని నిర్లక్ష్యం చేస్తూ.. పోషణ ఖర్చులు ఇవ్వకపోవడంతో పాటు వేధింపులకు గురిచేశాడని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన న్యాయమూర్తి భరత్ చంద్ర శిక్ష విధించగా, పోలీసులు అమీర్ బాషాను సబ్ జైలుకు తరలించారు.