MBNR: జడ్చర్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో బుధవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసులు అందజేశారు. బకాయి వేతనాలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ తెలిపారు.
తెలంగాణ
జడ్చర్ల ఆసుపత్రి కార్మికుల మెరుపు సమ్మె


