హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ రికార్డులు స్వాధీనం

NGKL: అచ్చంపేట మండలం అక్కారం గ్రామపంచాయతీ రికార్డులను డివిజన్‌ పంచాయతీ అధికారి వెంకటప్రసాద్‌ మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.15 లక్షల అవినీతి జరిగిందని గ్రామస్థులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచి సమక్షంలో పనులు, నిధుల ఖర్చుల వివరాలు తెలుసుకున్న అధికారి విచారణ కోసం రికార్డులు తీసుకున్నారు.