హైదరాబాద్: 28°C
తెలంగాణ

24 లక్షలు దుర్వినియోగం.. స్పందించిన అధికారులు

MLG: ఏటూరునాగారం మండలం రోహీర్ GPలో రూ.24 లక్షల నిధుల దుర్వినియోగం జరిగిందని వార్డు సభ్యులు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయినా చర్యలు లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.