హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైస్ ఇన్‌స్టిట్యూట్‌లో శక్తి టీం అవగాహన కార్యక్రమం

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో చీరాల రైస్ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజ్యలక్ష్మి, శక్తి బృందం కానిస్టేబుల్ సుబ్బారావు నేతృత్వంలో శక్తి యాప్ వినియోగం, పోక్సో చట్టం, స్వీయ రక్షణ, సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో హెల్ప్ లైన్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు.