PPM: గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ షేక్ హఫీజా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా డే సమావేశంలో పాల్గొని పిల్లలకు రోగనిరోధక శక్తి కల్పించడం, ఇమ్యునైజేషన్ షెడ్యూల్, గర్భిణుల నమోదు, శిశు మరణాల రేటు తగ్గింపు తదితర అంశాలపై ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఆశా యాప్‌లో సేవల వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్సీని సందర్శించిన అదనపు డీఎంహెచ్‌వో


