KDP: PGRS ద్వారా అందిన ఫిర్యాదులపై మున్సిపల్ కమిషనర్ డాక్టర్ పి. భవానీ ప్రసాద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయకుండా, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
PGRS ఫిర్యాదుల పరిష్కారంపై కమిషనర్ సమీక్ష


