హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ బాలాజీ ఆలయంలో హుండీ లెక్కింపు

MDCL: అల్వాల్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించగా రూ. 7,84,790 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సతీష్‌ కుమార్‌ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు కె. మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తుల సమక్షంలో లెక్కింపు చేపట్టినట్లు పేర్కొన్నారు. అర్చకులు రఘు పంతులు, శ్రీను పంతులు, వంశీ పంతులు ఉన్నారు.