హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్లపాలెంలో రేషన్ డీలర్ల వినతి

BPT: చౌక ధరల దుకాణదారుల సమస్యలను పరిష్కరించాలని డీలర్ల జిల్లా అధ్యక్షుడు చెరుకూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. కర్లపాలెం తహసీల్దార్ రవీంద్రకుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అధునాతన పరికరాలు ఇచ్చే వరకు క్యూఆర్ స్కానింగ్ విధానాన్ని నిలిపివేయాలని, ప్రతి డీలర్‌కు నెలకు రూ.5,000 సేవా రుసుము చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు పాల్గొన్నారు.