హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్యకర్తలకు జీవితాంతం తోడుగా ఉంటా'

VZM: 20 సంవత్సరాలుగా తన వెంటే ఉంటూ తోడుగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడూ చేదోడువాదోడుగా ఉంటానని మాజీ జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. తాను ఈ జిల్లా వాసిని అని, మెరకముడిదాం తన రాజకీయ పుట్టినిల్లు అని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులేనని, ఎవరికి కష్టం వచ్చినా గతంలో మాదిరిగానే అండగా ఉంటానని తెలిపారు.