హైదరాబాద్: 28°C
క్రీడలు

వరల్డ్ కప్ 2027 టికెట్లకు భారీ స్పందన

ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2027 టికెట్ల బ్యాలెట్‌కు ప్రపంచవ్యాప్తంగా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రారంభమైన 12 రోజుల్లోనే 142 దేశాల నుంచి 44.23 లక్షల మంది రిజిస్టర్ చేసుకోగా, ఏకంగా 1,50,83,752 దరఖాస్తులు వచ్చాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరిగే ఈ టోర్నీ టికెట్ల కోసం నవంబర్ 21 వరకు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది.