హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేక్ బ్యాంక్ మెసేజ్‌లు నమ్మొద్దు: ఎస్పీ

PLD:​ బ్యాంకు లావాదేవీల పేరిట వాట్సాప్‌కు వచ్చే అనుమానాస్పద సందేశాలకు 'YES' లేదా 'NO' అని సమాధానం ఇవ్వవద్దని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ అదహళ్లి హెచ్చరించారు. గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయరాదని, ఓటీపీ లేదా బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. సైబర్ మోసాల బారిన పడితే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.