హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: పద్మారావు గౌడ్

HYD: చిలకలగూడలోని చారిత్రాత్మక కట్ట మైసమ్మ ఆలయాన్ని ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ప్రజలంతా నవరాత్రి వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ యువనేత కిషోర్ కుమార్, మాజీ కార్పొరేటర్‌లు హేమ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.