హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21 రకాల కూరగాయలతో అమ్మవారి అలంకరణ

కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి, చాముండేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మూడో రోజు సందర్భంగా అమ్మవారిని 21 రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.