హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MROకి వినతి పత్రం అందజేసిన రేషన్ డీలర్లు

W.G: ఉండి మండల రేషన్ డీలర్లు మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రాంప్రసాద్ రాజుకి వినతిపత్రం అందజేశారు. డీలర్లకు గౌరవ వేతనం, కమీషన్ పెంపు, ఇతర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని డీలర్ల సంఘం నాయకులు హెచ్చరించారు.