ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం భైరవకోన భైరవేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం త్రిముక దుర్గాంబా దేవి అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
భైరవకోనలో అన్నపూర్ణ దేవిగా అమ్మవారి దర్శనం


