తూ.గో: భర్త మరణవార్తతో కువైట్‌లో చిక్కుకుపోయిన మునిపల్లెకు చెందిన చింతల నాగలక్ష్మిని మంత్రి కందుల దుర్గేష్ చొరవతో ఎలాంటి ఖర్చు లేకుండా స్వగ్రామానికి చేర్చారు. యాజమాన్యం వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో స్వదేశానికి రాలేకపోతున్న ఆమెకు మంత్రి తక్షణ సహాయం అందించి, భర్తను చివరిసారిగా చూసుకునే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కువైట్ నుంచి మహిళను స్వగ్రామానికి చేర్చిన మంత్రి దుర్గేష్


