హైదరాబాద్: 28°C
క్రీడలు

'జిమ్ జిమ్ తార' పాటకు అరుదైన గుర్తింపు

సోషల్ మీడియాలో పాపులరైన గోకుల లక్ష్మీదేవి జానపద గీతం 'జిమ్ జిమ్ తార' అంతర్జాతీయ వేదికపై మారుమోగుతోంది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ క్లబ్ 'ఇంటర్ మయామి' తమ ప్రాక్టీస్ వీడియోకు ఈ పాటను నేపథ్య సంగీరంగా జోడించింది. మన స్థానిక తెలుగు జానపదానికి గ్లోబల్ స్థాయిలో అరుదైన గుర్తింపు దక్కడంపై సంగీత ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.