ATP: తాడిపత్రి రూరల్‌లోని శ్రీవాణి హైస్కూల్‌లో 70వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-14, అండర్-17 బాలబాలికల తైక్వాండో పోటీలను ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో డీఈవో అయూబ్ హుస్సేన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడిపత్రిలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభం


