హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొలంబడి ద్వారా రైతులకు అవగాహన

AKP: నాతవరం మండలం ఎంబి.పట్నం గ్రామంలో మంగళవారం మండల వ్యవసాయాధికారి జి. సుగుణ ఆధ్వర్యంలో పొలంబడి నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పంటలో తెగుళ్లు, శత్రు-మిత్ర పురుగుల గుర్తింపు, పిలకదశలో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఎకరాకు 20-25 కిలోల యూరియా, 12-15 కిలోల పొటాష్ వేయాలని సూచించారు.