VZM: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎల్.కోట మండలం కళ్లేపల్లిలో పీహెచ్‌సీ పనులకు శంకుస్థాపన చేశారు. కళ్లేపల్లి గ్రామంలో అత్యధిక జనాభా కలిగిన పంచాయతీ అని చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు ఈ పీహెచ్‌సీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


