ASR: దసరా సెలవులకు వెళ్లేవారు విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచరాదని అరకు సర్కిల్ సీఐ ఏ.కోటేశ్వరరావు సూచించారు. ప్రయాణాల్లో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారం మెరుగుపెడతామనే వ్యక్తులను నమ్మరాదన్నారు. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


