నెల్లూరు: మనుబోలు మండలం పీడూరు గ్రామంలో మంగళవారం వర్షాల కోసం వరుణ యాగాన్ని నిర్వహించారు. అర్చకులు మొదట ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పూజలు తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. అనంతరం వేద పండితుల సమక్షంలో వేద మంత్రాలు చదువుతూ వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యాగం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండుతాయని రైతుల నమ్మకం.
ఆంధ్రప్రదేశ్
మనుబోలులో వర్షాల కోసం వరుణ యాగం..!


