హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మచిలీపట్నం మేయర్‌ సీటు మాకే ఇవ్వాలి'

కృష్ణా: మచిలీపట్నం మేయర్‌ సీటును యాదవులకు కేటాయించాలని యాదవ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో సంఘ అధ్యక్షుడు పల్లపాటి వెంకట్రావు, తదితరులు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ విజయానికి కృషి చేస్తున్నా, యాదవులకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. మేయర్‌ సీటును బీసీ మహిళకు కేటాయించిన నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.