హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేపీఐ పురోగతిపై కలెక్టర్ ఏ.సిరి సమీక్ష!

కర్నూలు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వివిధ శాఖల అధికారులతో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐ) పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల సాధన, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.