హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపాలి'

అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్, పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయాలని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ మున్సిపల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. రోడ్డు ఆక్రమణలు తొలగించి, జీబ్రా క్రాసింగ్‌లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.