హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తలనీలాల వేలంతో ఆలయానికి భారీ ఆదాయం

KDP: కార్తీక మాసంలో భక్తులు సమర్పించే నిత్యపూజయ్య స్వామి తలనీలాలు రూ.4.84 లక్షలు పలికినట్లు ఆలయ ఈవో సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. సిద్దవటంలోని రంగనాథస్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం తలనీలాల సేకరణ హక్కుకు వేలం నిర్వహించారు. గతేడాది రూ.3.30 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.1.54 లక్షలు అదనంగా ఆదాయం లభించింది.