హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజా ది గ్రేట్.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం

కాకినాడ: ప్రత్తిపాడు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన అనారోగ్యంతో నడవలేని వీఆర్వోను చేతులపై ఎత్తుకుని వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి కోర్టులోకి తీసుకెళ్లిన కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ రాజాబాబు మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణకు మించి ఆపన్నహస్తం అందించిన రాజాబాబు సేవాభావాన్ని కిర్లంపూడి ఎస్సై జి. సతీష్ కుమార్ అభినండించారు.