హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: కీసరలో రూ.2 కోట్ల డీఎంఎఫ్ నిధులతో కీసర–ఎస్. అమరవరం బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే కీసర, ఎస్. అమరవరం గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. రైతులు, విద్యార్థులకు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.