హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా దర్బార్‌లో వినతుల స్వీకరించిన ఎమ్మెల్యే గోరంట్ల

తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో పలువురు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం కోరుతూ వినతులు సమర్పించారు. కొంతమూరు, పిడింగొయ్యి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని కోరుతూ గ్రామస్థులు అందించిన వినతులను ఎమ్మెల్యే స్వీకరించారు.