SKLM: కొత్తూరు మండల కేంద్రంలో నిత్యం పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. విద్యుత్ ఆదా చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట వెలగాల్సిన లైట్లు పగలు వెలగడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. వెంటనే స్పందించి టైమర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
పగటి పూట వీధి దీపాల వెలుగులు


