NTR: నందిగామ మెయిన్ బజార్‌లోని ఎంఎస్ జ్యూయలరీ అధినేత మహంకాళి శ్రీనివాసరావుపై పట్టపగలే దాడి జరిగింది. భార్యాభర్తలుగా ఉన్న దుండగులు ఆయన గొంతు నులిమి బంగారాన్ని దోచుకెళ్లారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పట్టణ నడిబొడ్డునే ఇలాంటి దోపిడీ జరగడంతో వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్
పట్టపగలే బంగారు వ్యాపారిపై దాడి


