హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో రూ.7 కోట్లతో గాంధీ రోడ్డు విస్తరణ

కడప జిల్లా ప్రొద్దుటూరులో గాంధీ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు. రూ.7 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసిందని, అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నామని వెల్లడించారు.