హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హరిజనవాడలో తాగునీటి కష్టాలు

కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిజనవాడలో బోరు మోటారు చెడిపోవడంతో 200కు పైగా కుటుంబాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బోరు మోటారు పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బోరు మోటారుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలన్నారు.