గుంటూరు నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 21 సుజుకి స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరంతా నల్లచెరువు, సంపత్‌నగర్ ప్రాంతాలకు చెందినవారని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
స్కూటీ దొంగల ముఠా అరెస్ట్


