హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గేదెల్లంకలో రూ.1.55 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామంలో రూ.80 లక్షలతో పుష్కర ఘాట్‌, రూ.75 లక్షలతో ఘాట్‌కు వెళ్లే రహదారుల నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు.