అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. తమకు పెండింగులో ఉన్న నాలుగు నెలల వేతనాలు వెంటనే మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు. వచ్చే అరకొర వేతనాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ కార్యాలయం ముందు నీటి కార్మికుల ధర్నా


