హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పుడే ఎన్నికల వేడి.. వార్డుల్లో రాజకీయ సందడి!

CTR: చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో నగరంలో రాజకీయ సందడి మొదలైంది. అధికారికంగా అభ్యర్థులు ఖరారు కాకముందే ఏ వార్డులో ఎవరు పోటీ చేస్తారు? ఎవరికి ప్రజాబలం ఉంది? అన్న చర్చలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నేతలు తమ బలాబలాలను అంచనా వేసుకుంటుండటంతో చిత్తూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.