హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ రేసులో ఎవరంటే!

TPT: సూళ్లూరుపేట మున్సిపల్ ఛైరపర్సన్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా పిట్ల సుహాసిని పేరు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మాజీ మండలాధ్యక్షుడు పిట్ల సుబ్రహ్మణ్యం సతీమణి అయిన సుహాసిని అభ్యర్థిత్వంపై చర్చ సాగుతోంది.