హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సబ్సిడీ ధరలకే ‘ధరణి’ బియ్యం విక్రయాలు

PLD: చిలకలూరిపేట రైతు బజార్లలో ‘ధరణి’ బియ్యం విక్రయాలు ప్రారంభమయ్యాయి. బహిరంగ మార్కెట్ ధరల నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం 26 కిలోల బస్తాల్లో సబ్సిడీ ధరలకు నాణ్యమైన బియ్యాన్ని అందిస్తోంది. BPT రకం కిలో రూ.49, KNM/RNR రకం కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. సామాన్యులకు ఉపశమనం కలిగించే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.