హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రహదారి ఇరువైపులా తుప్పలు.. ప్రయాణికుల ఇబ్బందులు

ASR: గుంటసీమ ప్రధాన రహదారి నుంచి అరమ వెళ్లే మార్గం అధ్వానంగా మారుతోంది. రోడ్డుకు ఇరువైపులా దట్టంగా పెరిగిన పిచ్చిమొక్కలు, తుప్పలు వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారాయి. ఈ పరిస్థితులతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రహదారి పక్కన ఉన్న తుప్పలను తొలగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.