KKD: ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా ఈ నెల 16 సాయంత్రం 6 గంటల వరకు తుని పట్టణంలోని పెద్ద రైల్వేగేటు మూసి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. తొలుత ఈ నెల 13 వరకు పనులు పూర్తవుతాయని భావించినా, మరికొన్ని మిగిలిపోవడంతో గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. తుని పట్టణం నుంచి వి. కొత్తూరు జాతీయ రహదారి వైపు వెళ్లే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 16 వరకు తుని పెద్ద రైల్వే గేటు మూసివేత


