BPT: పర్చూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మంగళవారం దసరా ఉత్సవాల్లో భాగంగా 'అన్నపూర్ణా దేవి' అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవాలయ అర్చకులు హర్షవర్ధనాచార్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్నపూర్ణా దేవి' గా వాసవి అమ్మవారు


