హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత'

కృష్ణా: భూమిపై జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ & రీ-ఫారెస్టేషన్ ఫర్ ఎకొలాజికల్ ఎన్రిచ్ మెంట్ చైర్మన్, శాసన మండలి సభ్యులు కొణిదల నాగబాబు పిలుపునిచ్చారు. ఇవాళ నాగాయలంక మండలం సంగమేశ్వరం సముద్రతీరంలో మడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్య అతిధి కొణిదల నాగబాబు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు.