హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

ATP: తిరుమల వెంకటేశ్వరస్వామిని MLA దగ్గుపాటి ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంపై ఎల్-నినో ప్రభావం తొలగిపోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని ఆకాంక్షించారు.